పలాస, సెప్టెంబర్ 10 (వై7 న్యూస్ తెలుగు):
శ్రీకాకుళం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు మాకనపల్లి గ్రామ సచివాలయ అధికారులకు గురువారం రైతు సంఘం నాయకులు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రాబోయే రబీ సీజన్‌కు ప్రత్యామ్నాయ స్వల్పకాలిక విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా అందించాలని కోరారు. అలాగే ఉపాధి హామీ పథకంలో పని దినాలను 200 రోజులకు పెంచి, రోజువారీ కూలీని రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో తెప్పల అజయ్ కుమార్, సాలిన వీరస్వామి, కోరాడ లింగమూర్తి, బత్తిని ప్రసాద్, తెప్పల రాజు, బత్తిన దుర్యోధన, సలీన కోదండరావు, జుత్తు లోకనాథం, ఎం. జీవన్ రావు, గర్తం ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.









