శ్రీకాకుళం జిల్లా, పలాస:
హైదరాబాద్ నుంచి కలకత్తా వైపు వెళ్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ పలాస రైల్వే స్టేషన్ సమీపంలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గల కారణాలపై రైల్వే పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మహిళ వివరాలు ఇంకా తెలియరాలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.
Post Views: 13








