శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూండి గ్రామంలోని సాగర్ కాలనీలో చోరీ ఘటన కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ఆసరాగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు ఇంటి పై అంతస్తులోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.
ఇంట్లోని సూట్‌కేసులో భద్రపరిచిన సుమారు 3 తులాల బంగారం, రూ.15 వేల నగదును అపహరించినట్లు బాధితులు తెలిపారు. చోరీ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆదివారం కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని, రూరల్ సీఐ తిరుపతిరావు ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాల సేకరణతో పాటు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 11








