కరకగూడెం , ఆగస్టు 26 (Y7 న్యూస్ తెలుగు):
కరకగూడెం మండలంలోని చదువుకున్న యువతీ యువకులు పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లయితే, వారికి శుభవార్త. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఉచిత కోచింగ్ కార్యక్రమం కోసం ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
పోలీస్ ఉద్యోగాలను లక్ష్యంగా పెట్టుకుని సిద్ధమవుతున్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలతో కరకగూడెం పోలీస్ స్టేషన్ను సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత కోచింగ్ ద్వారా ఉద్యోగ సాధనలో ముందడుగు వేయాలని పోలీసులు కోరారు.
ఈ విషయాన్ని కరకగూడెం ఎస్సై పీ.వి. నరసింహారావు వెల్లడించారు.
రిపోర్టర్: దిలీప్ కుమార్
Post Views: 62








