ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ Xperia 10 సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. Sony Xperia 10 VIII పేరుతో వచ్చిన ఈ ఫోన్‌లో గత తరం మోడల్‌తో పోలిస్తే డిస్‌ప్లే, ఆడియో, బ్యాటరీ పనితీరు, హార్డ్‌వేర్ షార్ట్‌కట్ కంట్రోల్స్‌లో పలు మార్పులు చేశారు. రోజువారీ వినియోగాన్ని మరింత సులభతరం చేయడంతో పాటు యాక్సెసిబిలిటీకి ప్రాధాన్యతనిస్తూ ఈ ఫోన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
Xperia 10 VIIIలో 6.1 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లేను అందించారు. ఇది గత మోడల్‌తో పోలిస్తే సుమారు 50 శాతం ఎక్కువ బ్రైట్నెస్‌ను అందిస్తుంది. అలాగే ఫ్రంట్ స్టీరియో స్పీకర్లను అప్‌గ్రేడ్ చేసి సౌండ్ అవుట్‌పుట్‌ను సుమారు 15 శాతం పెంచారు. బాస్ కూడా 30 శాతానికి పైగా మెరుగుపడినట్లు సోనీ వెల్లడించింది.
రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫోన్‌లో ‘Rewards & Pay’ షార్ట్‌కట్‌ను కూడా అందించారు. పవర్ బటన్‌ను రెండుసార్లు నొక్కడం ద్వారా పేమెంట్, రివార్డ్ యాప్స్‌ను త్వరగా యాక్సెస్ చేసుకోవచ్చు. 5,000mAh బ్యాటరీతో రెండు రోజుల వరకు బ్యాటరీ లైఫ్ అందిస్తుందని సోనీ పేర్కొంది. దీంతో కాంపాక్ట్ డిజైన్‌తో పాటు సులభమైన వినియోగాన్ని కోరుకునే వారికి Xperia 10 VIII ఆసక్తికరమైన ఆప్షన్‌గా నిలవనుంది.








