E-PAPER

మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకెళ్తున్న జీవీ ప్రకాష్.. యాక్టర్‌గా కూడా ఫుల్ బిజీ!

భారతీయ చిత్రసీమలో సంగీత దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జి.వి. ప్రకాష్ కుమార్ ప్రస్తుతం అత్యంత బిజీగా ఉన్న మ్యూజిక్ కంపోజర్లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు పాన్ రీజినల్, పాన్ ఇండియా సినిమాలకు సంగీతం అందిస్తూ వరుస భారీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నాడు. చేతినిండా సినిమాలతో జీవీ ప్రస్తుతం సెన్సేషనల్ ఫామ్‌లో ఉన్నాడు.

జీవీ ప్రకాష్ లైనప్‌లో సూర్య 46వ చిత్రం ‘విశ్వనాధ్ అండ్ సన్స్’, దుల్కర్ సల్మాన్ 41వ సినిమా ‘ఆకాశంలో ఒక తార’, ‘శ్రీ శ్రీ’, రవితేజ ‘ఇరుముడి’, విశాల్ నటిస్తున్న ‘మకుటం’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఘట్టమనేని జై కృష్ణ నటించిన ‘శ్రీనివాస మంగాపురం’ తాజాగా థియేటర్లలోకి రాగా, ఈ చిత్రానికి జీవీ అందించిన నేపథ్య సంగీతానికి మంచి స్పందన లభించింది. అంతేకాకుండా హాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కోసం కూడా జీవీ సంగీతం అందించడంతో పాటు నటించాడు.

మరోవైపు నటుడిగానూ జీవీ ప్రకాష్ తన సత్తా చాటుతున్నాడు. ‘ఇమ్మోర్టల్’, ‘మెంటల్ మదిలో’ వంటి సినిమాల్లో నటిస్తూ తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. దీనితో పాటు తన తొలి పూర్తి స్థాయి హిందీ ఆల్బమ్ ‘నయీ నవేలీ’పై కూడా పని చేస్తున్నాడు. ఒకేసారి సంగీత దర్శకుడు, నటుడు, సింగర్‌గా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ తన వర్సటిలిటీని చాటుకుంటున్న జీవీ.. సౌత్ నుంచి నార్త్ వరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ టాలెంట్స్‌లో ఒకరిగా దూసుకెళ్తున్నాడు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News