
దుమ్ముగూడెం, జూలై 23 (వై 7 న్యూస్ ):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా 95 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, దుమ్ముగూడెం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు మరియు పలువురు స్థానికులు పాల్గొన్నారు.
Post Views: 16









