E-PAPER

ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఎన్‌ఎస్‌ఏ అధికారాలు.. కేంద్రం కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా చట్టం (NSA), 1980 కింద ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్కు నిర్బంధ అధికారాలను వినియోగించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ఈ అధికారాలు 2026 జూలై 19 నుంచి అక్టోబర్ 18 వరకు మూడు నెలలపాటు అమల్లో ఉంటాయని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఎన్‌ఎస్‌ఏ ప్రకారం ఎవరినైనా అధికారికంగా కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి గరిష్ఠంగా 12 నెలల వరకు నిర్బంధంలో ఉంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా పలు ప్రాంతాల్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. NEET ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసనలు చేపడుతున్నారు.

ఈ పరిస్థితుల్లోనే కేంద్రం ఎన్‌ఎస్‌ఏ అధికారాల పొడిగింపు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ నిర్ణయానికి ప్రస్తుత విద్యార్థుల నిరసనలతో ఎలాంటి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News