E-PAPER

అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు కఠిన హెచ్చరిక

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అవినీతిపై మరోసారి కఠిన వైఖరిని వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, అవినీతి ఏ స్థాయిలో జరిగినా కఠిన చర్యలు తప్పవని మంత్రివర్గానికి స్పష్టం చేశారు. ప్రజా ధనాన్ని పారదర్శకంగా వినియోగించాలని, అవకతవకలకు ఎలాంటి అవకాశం ఉండకూడదని ఆదేశించారు.

తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్ ప్రభుత్వ ఖర్చుల విషయంలో నిర్లక్ష్యం లేదా అవినీతిని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. ప్రభుత్వ నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలు బయటపడినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లు సమాచారం.

అంతేకాకుండా ప్రజా సేవ కంటే సోషల్ మీడియా ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వొద్దని మంత్రులకు సూచించారు. ముఖ్యంగా పాఠశాలల్లో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేదా ప్రచార వీడియోలు చిత్రీకరించడాన్ని నిషేధించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల సంక్షేమానికే పరిమితం కావాలని, ప్రచారం కోసం విద్యాసంస్థలను వినియోగించరాదని సీఎం విజయ్ స్పష్టం చేసినట్లు సమాచారం.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News