E-PAPER

హార్ముజ్‌కు ప్రత్యామ్నాయ మార్గాలపై గల్ఫ్ దేశాల ఫోకస్

అమెరికా–ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ప్రపంచ ఇంధన అవసరాల్లో సుమారు 20 శాతం ఈ సముద్ర మార్గం ద్వారానే సరఫరా అవుతుండటంతో, గల్ఫ్ దేశాలు ప్రత్యామ్నాయ ఎగుమతి మార్గాల అభివృద్ధిపై దృష్టి సారించాయి. హార్ముజ్‌పై ఆధారపడకుండా చమురు, సహజవాయువును ఎగుమతి చేసేందుకు ఇరాక్, యూఏఈ, సౌదీ అరేబియా ప్రణాళికలను వేగవంతం చేస్తున్నాయి.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇరాక్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దాటకుండా చమురు తరలించే భారీ పైప్‌లైన్ ప్రాజెక్టులను చేపట్టగా, సౌదీ అరేబియా కూడా ఇలాంటి ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తోంది. మరోవైపు యూఏఈ కొత్త పోర్టు నిర్మాణానికి సన్నాహాలు చేస్తూ ఎగుమతి సామర్థ్యాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

గోల్డ్‌మన్ సాక్స్ విశ్లేషకురాలు అలెగ్జాండ్రా పాలస్ అంచనా ప్రకారం, 2027 చివరి నాటికి గల్ఫ్ దేశాలు యుద్ధానికి ముందు ఎగుమతి చేసిన చమురులో దాదాపు 45 శాతాన్ని హార్ముజ్ జలసంధిపై ఆధారపడకుండా ప్రపంచ మార్కెట్లకు పంపే సామర్థ్యాన్ని సాధించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. ఈ చర్యలు భవిష్యత్తులో సరఫరా అంతరాయాల ప్రమాదాన్ని తగ్గించడంలో కీలకంగా మారే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News