E-PAPER

ఒప్పో, వన్‌ప్లస్ నుంచి 10,000mAh బ్యాటరీ ఫోన్లు? మొబైల్ రంగంలో కొత్త సంచలనం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఒప్పో (Oppo), వన్‌ప్లస్ (OnePlus) బ్యాటరీ సామర్థ్యంలో కొత్త రికార్డులు సృష్టించే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. చైనాకు చెందిన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబోలో లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ రెండు కంపెనీలు ఏకంగా 10,000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల భారీ బ్యాటరీలతో స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

ప్రస్తుతం వన్‌ప్లస్ ఈ 10,000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌పై ప్రాథమిక పరిశోధన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమాచారం ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. మరోవైపు ఒప్పో తన ప్రసిద్ధ ‘A’ సిరీస్‌లో భాగంగా 10,000mAh సింగిల్-సెల్ బ్యాటరీతో కూడిన ఫోన్‌ను మొదటగా విడుదల చేసే అవకాశం ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే వన్‌ప్లస్ వచ్చే ఏడాది ‘ప్రో’ బ్రాండింగ్‌తో, మోడల్ నంబర్ SM8845తో ఒక కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను 10,000mAh కన్నా పెద్ద బ్యాటరీతో లాంచ్ చేయాలని ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్లు నిజంగా మార్కెట్లోకి వస్తే, రోజులు పాటు ఛార్జింగ్ అవసరం లేకుండా ఉపయోగించుకునే స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని వినియోగదారులకు అందించే అవకాశం ఉంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News