E-PAPER

మణుగూరులో TGNPDCL సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పర్యటన

మణుగూరు, జూలై 16 (వై7 న్యూస్):
తెలంగాణ నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGNPDCL) సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, ఐఏఎస్ గురువారం మణుగూరులోని 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్, సబ్ డివిజన్ కార్యాలయం, విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యుత్ సరఫరా పరిస్థితులు, వినియోగదారులకు అందిస్తున్న సేవలు, రెవెన్యూ వసూళ్లు, నిర్వహణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయాలను తగ్గించడంతో పాటు వినియోగదారుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.విద్యుత్ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సీఎండీ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ జి. మహేందర్, డివిజనల్ ఇంజినీర్ కె. జీవన్ కుమార్, ఏడీఈ డి. ఉమా మహేశ్వరరావు తదితర విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News