E-PAPER

దుమ్ముగూడెంలో పిచ్చి మొక్కల తొలగింపు కార్యక్రమం


దుమ్ముగూడెం, జూలై 16 (వై7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ సెక్రటరీ మాలోత్ నరేష్ ఆధ్వర్యంలో రహదారుల పక్కన పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టారు. పంచాయతీ సిబ్బంది సహకారంతో రోడ్ల వెంట పెరిగిన కలుపు మొక్కలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా సెక్రటరీ మాలోత్ నరేష్ మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పిచ్చి మొక్కలను తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని కోరారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News