E-PAPER

కేజీబీవీ పినపాక విద్యార్థినులకు ఏకరూప దుస్తుల పంపిణీ

పినపాక,

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పినపాకలో మంగళవారం విద్యార్థినులకు ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పినపాక మండల విద్యాశాఖ అధికారి కె. నాగయ్య విద్యార్థినులకు యూనిఫాంలను పంపిణీ చేసి, వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా విద్యార్థినుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం విజయ, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ పద్మ, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News