మణుగూరు, జూలై 4 (Y7 News):
మణుగూరు సింగరేణి ఏరియా జీఎం కార్యాలయం వద్ద తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం కోల్ మైన్స్ అధికారుల సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మద్దతు తెలిపారు.
దీక్షా శిబిరాన్ని సందర్శించిన ఆయన, అధికారుల సమస్యలను ప్రభుత్వం, యాజమాన్యం సానుకూలంగా పరిశీలించి పరిష్కరించాలని కోరారు. అధికారుల న్యాయమైన హక్కుల కోసం చేపడుతున్న పోరాటానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యులు ఊకంటి ప్రభాకర్, మాజీ జెడ్పీటీసీ పోశం నరసింహారావు, ముత్యం బాబు, యాదగిరి గౌడ్, సకిని బాబురావు తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.
Post Views: 51








