ములుగు, జూలై 4 (వై7 న్యూస్):
ములుగు పట్టణానికి చెందిన ఉల్లెరావు అర్జున్–తిరుపతమ్మ దంపతుల ఏకైక పుత్రిక వివాహ వేడుక శనివారం జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచనలతో కార్యక్రమానికి హాజరైన ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వధూవరులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లక్కీ, ములుగు పట్టణ యూత్ అధ్యక్షుడు అభినయ్ చారి, యూత్ నాయకులు ప్రభు, గూడెపు రాకేష్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 43








