E-PAPER

పోక్సో కేసులో ఫర్మాన్ ఖాన్‌కు ఎదురుదెబ్బ.. ట్రాన్సిట్ బెయిల్ పొడిగింపునకు కేరళ హైకోర్టు నిరాకరణ

 

వైరల్ కుంభమేళా గర్ల్ మోనాలిసా భోస్లే భర్త ఫర్మాన్ ఖాన్‌కు సంబంధించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌లో నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కోరుతూ ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ గడువు పొడిగించాలని చేసిన అభ్యర్థనను కేరళ హైకోర్టు తిరస్కరించింది. గతంలో సంబంధిత కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పిస్తూ కేరళ హైకోర్టు ఫర్మాన్‌కు ఒక నెల రోజుల ట్రాన్సిట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.

అయితే, మధ్యప్రదేశ్‌లోని మాండ్లేశ్వర్ పోక్సో ప్రత్యేక కోర్టు జూలై 1న ఫర్మాన్ ఖాన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. దీంతో ఆయన మళ్లీ కేరళ హైకోర్టును ఆశ్రయించి ట్రాన్సిట్ బెయిల్ గడువు పొడిగించాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ‘ప్రియా ఇండోరియా వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక’ తీర్పును ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒకసారి సంబంధిత రాష్ట్రంలోని అధికార పరిధి గల కోర్టును ఆశ్రయించి అక్కడ అనుకూలం లేదా ప్రతికూలంగా ఉత్తర్వులు వచ్చిన తర్వాత ట్రాన్సిట్ బెయిల్‌పై మరోసారి ఈ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కారణంగా ఫర్మాన్ ఖాన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పోక్సో కేసులో ఆయనకు మరో న్యాయపరమైన ఎదురుదెబ్బ తగిలింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News