దమ్మపేట, జూన్ 28 (వై7 న్యూస్):
అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేట మండలం నాయిడుపేట గ్రామంలో సీపీఎం మండల సీనియర్ నాయకుడు దొడ్డా లక్ష్మీనారాయణ మాతృమూర్తి దొడ్డా సత్యవతి పెద్దకర్మ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు సోయం వీరభద్రం హాజరై దొడ్డా సత్యవతి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం దొడ్డా లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు.
ఈ కార్యక్రమంలో రాచురుపల్లి మాజీ సర్పంచ్ తోట రాజు, కీసరి మల్లికార్జునరావు, ఊకే నరసింహారావు, సోయం వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
– జిల్లా స్టాఫ్ రిపోర్టర్, రాజేష్ తమ్మళ్ల

Post Views: 9








