E-PAPER

పరీక్షకు ఒక్క రోజు ముందు టెట్ పేపర్ లీక్.. మహారాష్ట్రలో రేపటి టెట్ పరీక్ష వాయిదా

మహారాష్ట్రలో టెట్ (TET) పరీక్షకు ముందు తీవ్ర కలకలం రేగింది. పరీక్షకు కేవలం ఒక్క రోజు ముందుగానే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన విద్యాశాఖ, ఆదివారం జరగాల్సిన టెట్ పరీక్షను తక్షణమే వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ అనూహ్యా పరిణామంతో లక్షలాది మంది అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు.

పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం.. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. లీక్‌కు బాధ్యులైన వారిని గుర్తించేందుకు పోలీసు శాఖ రంగంలోకి దిగింది. ప్రాథమిక విచారణలో కొందరు సిబ్బంది ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.

వాయిదా పడిన పరీక్షకు సంబంధించిన కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, అధికారిక వెబ్‌సైట్ ద్వారా వచ్చే అప్‌డేట్స్‌ను మాత్రమే గమనించాలని సూచించారు. కొత్త షెడ్యూల్ విడుదలయ్యాక, అదే హాల్ టికెట్లతో పరీక్షకు హాజరుకావచ్చని పేర్కొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News