E-PAPER

షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియల్లో.. పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సైఫుల్లా కసూరి, వీడియో వైరల్

పాకిస్థాన్ మాజీ క్రికెటర్, స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ సోదరుడి అంత్యక్రియలకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ అంత్యక్రియల్లో పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సైఫుల్లా కసూరి ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అంతర్జాతీయంలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒకవైపు కశ్మీర్ లోయలో అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాది.. పాకిస్థాన్ లోని ప్రముఖుల అంత్యక్రియల్లో స్వేచ్ఛగా తిరగడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పాకిస్థాన్ తీరును తప్పుబడుతున్నారు. ఉగ్రవాదులకు ఆ దేశం ఇస్తున్న ఆశ్రయానికి ఇది మరో నిదర్శనమని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని అంతర్జాతీయ వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

భారత్ లో భద్రతా బలగాలపై దాడులకు కుట్ర పన్నిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ లో వీరాభిమానం దక్కడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై షోయబ్ అక్తర్ ఎలాంటి వివరణ ఇస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఈ వైరల్ వీడియో ఆధారంగా నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తునకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News