కాశీబుగ్గ ;
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “నశా ముక్త్ భారత్” కార్యక్రమంలో భాగంగా పోలీసులు, మాజీ సైనికులు, కళాశాల విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. శ్రీనివాస లాడ్జ్ జంక్షన్ నుంచి పలాస ఇందిరా చౌక్ వరకు సాగిన ర్యాలీలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా వై. రామకృష్ణ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు, మాజీ సైనికులు, పోలీసు సిబ్బందితో కలిసి డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, మాజీ సైనికులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 5








