E-PAPER

భద్రాచలంలో దక్షత డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన డీఎస్పీ అరుణ్ కుమార్

భద్రాచలం, జూన్ 26 (వై7 న్యూస్): మాదక ద్రవ్యాల వ్యసనానికి గురైన బాధితుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు, వారికి వినోదం మరియు మానసిక ఉల్లాసం కల్పించే ఉద్దేశంతో భద్రాచలం డివిజన్ డీఎస్పీ అరుణ్ కుమార్ శుక్రవారం స్థానిక దక్షత డీ-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించారు.
తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈగల్ టీం, హైదరాబాద్ ద్వారా మంజూరైన కారమ్ బోర్డులు, చెస్ బోర్డులు వంటి ఆట వస్తువులను డీఎస్పీ సెంటర్ నిర్వాహకులకు అందజేశారు. అనంతరం అక్కడ చికిత్స పొందుతున్న బాధితులతో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితులు, చికిత్స పురోగతిపై ఆరా తీశారు. బాధితులకు కాలక్షేపం, మానసిక ప్రశాంతత కోసం ఆట వస్తువులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు, మద్యం మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుందని అన్నారు. వ్యసనాల కారణంగా సమాజంలో గౌరవం కోల్పోయే పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు.
చికిత్స పూర్తయిన అనంతరం బాధితులు పాత అలవాట్లను పూర్తిగా వదిలిపెట్టి, ఆత్మవిశ్వాసంతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి విద్య, ఉపాధి మరియు కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించి తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం పట్టణ సీఐ నాగరాజు, ఎస్‌ఐలు స్వప్న, సతీష్, పోలీసు సిబ్బంది మరియు దక్షత డీ-అడిక్షన్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News