ములకలపల్లి ;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు ములకపల్లి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్, ఎస్టీ హాస్టల్, కమలాపురం ఆశ్రమ పాఠశాలలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, అక్రమ రవాణాను అడ్డుకోవడంలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పారాలీగల్ వాలంటీర్లు, హాస్టల్ వార్డెన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Post Views: 6








