E-PAPER

రెండు సినిమాలు… కార్నర్ సీట్… OYOలో ఎండింగ్ – ప్రజెంట్ లవ్ ట్రెండ్‌పై అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ప్రస్తుత తరం ప్రేమలపై చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ రోజుల్లో ప్రేమలు, డేటింగ్ సంస్కృతి ఎలా మారిపోయాయో ఆయన తనదైన శైలిలో వివరిస్తూ కామెంట్స్ చేశారు. ఇప్పటి యువత ప్రేమ వ్యవహారాలు చాలా ఫాస్ట్‌గా సాగుతున్నాయని, పాత తరం నాటి ప్రేమలకు, ఇప్పటి లవ్ ట్రెండ్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత కాలంలో ప్రేమ అనేది చాలా లీనియర్‌గా, ఒకే ఫార్మాట్‌లో సాగిపోతోందని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ జనరేషన్ లవ్ స్టోరీలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. “ఈ రోజుల్లో ప్రేమంటే సింపుల్ అయిపోయింది. మొదట ఇద్దరు కలిసి ఒక రెండు సినిమాలు చూస్తారు.. థియేటర్లలో కార్నర్ సీట్లు బుక్ చేసుకుంటారు.. ఆ తర్వాత కథ నేరుగా ఓయో (OYO) రూమ్‌లలో ఎండ్ అవుతోంది” అంటూ నవ్వుతూనే నేటి ట్రెండ్‌పై ఘాటుగా స్పందించారు. అప్పట్లో ప్రేమ కోసం ఏళ్ల తరబడి వేచి చూసేవారని, కానీ ఇప్పుడు అంతా ఇన్‌స్టంట్‌గా మారిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సినిమా ప్రమోషన్లు లేదా ఓ టాక్ షోలో భాగంగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అల్లు అరవింద్ చెప్పిన ఈ లవ్ క్రోనాలజీ పక్కా ప్రాక్టికల్‌గా ఉందంటూ కొందరు యువకులు కామెంట్లు పెడుతుంటే, సీనియర్ ప్రొడ్యూసర్ నేటి సమాజంలో ఉన్న వాస్తవ పరిస్థితులను చాలా ఓపెన్‌గా మాట్లాడారంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ స్టైల్‌లో సాగిన ఈ ‘రెండు సినిమాలు.. కార్నర్ సీట్.. OYO ఎండింగ్’ కామెంట్స్ నెట్టంట తెగ హల్‌చల్ చేస్తున్నాయి.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News