
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటీసీ వెస్ట్ గేట్ వద్ద నేటి ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జామాయిల్ పుల్లలతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనుక వైపు నుండి వేగంగా వచ్చిన ఎర్టిగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న భూర్గంపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 69








