E-PAPER

అప్షోర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

వై7 న్యూస్ పలాస

పలాస, ఏప్రిల్ 6: పలాస ప్రాంత ప్రజలకు దశాబ్దకాలంగా కలగానే మిగిలిన అప్షోర్ రిజర్వాయర్ పనులను ఆదివారం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణ పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ పూర్తి ఎత్తు 55.5 అడుగులు నిర్మించాల్సి ఉండగా, ప్రస్తుతం 48 అడుగుల వరకు పనులు పూర్తయ్యాయని అధికారులు ఎమ్మెల్యేకు వివరించారు.పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆమె సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తైతే పలాస ప్రాంత రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News