వై7 న్యూస్ పలాస
పలాస, ఏప్రిల్ 6: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అంబుసోలిలో ఆదివారం శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి శ్రీరాముడిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Post Views: 1








