వై 7 న్యూస్ పలాస ;
మందస మండలం B. కేసుపురం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పిడుగు పడటంతో తల్లి, కుమార్తె ఇద్దరూ మృతి చెందిన సంఘటన గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది.
మృతులను మడియ కృష్ణవేణి (35), ఆమె కుమార్తె మడియ యోగేశ్వరి (15)గా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం, వారు ఇంటి సమీపంలోని తోటలో వ్యవసాయ పనులు చేస్తుండగా అకస్మాత్తుగా వర్షం మొదలైంది. వర్షం నుంచి రక్షణ కోసం చెట్టు కింద నిలబడిన సమయంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ఘటన స్థలంలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. తల్లి, కుమార్తె మృతదేహాలు పక్కపక్కనే ఉండటంతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురై కన్నీరు పెట్టుకున్నారు. కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అక్కడి వాతావరణాన్ని మరింత కలచివేశాయి.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరఫున తగిన పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు.









