E-PAPER

కాశీబుగ్గ ఎల్‌సీ గేట్ వద్ద గూడ్స్ రైలు ఆగడంతో గంటపాటు ట్రాఫిక్ జామ్

వై 7 న్యూస్ పలాస

కాశీబుగ్గలోని ఎల్‌సీ గేట్ వద్ద గూడ్స్ రైలు నిలిచిపోవడంతో ఆదివారం సుమారు గంటపాటు ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం కలిగింది.విశాఖపట్నం నుండి ఒడిశా వైపు వెళ్తున్న గూడ్స్ రైలు మధ్యలో నిలిచిపోవడంతో గేట్ పూర్తిగా మూసివేయబడింది. దీంతో రహదారి ఇరువైపులా వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
బస్సులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలు కిలోమీటర్ల మేర క్యూలుగా నిలిచిపోవడంతో ఉద్యోగాలకు, వ్యాపారాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది ప్రయాణికులు అసహనానికి గురయ్యారు.గంట తర్వాత రైలు కదలడంతో గేట్ తిరిగి తెరవబడింది. అనంతరం ట్రాఫిక్ క్రమంగా సవ్యస్థితికి చేరుకుంది.
స్థానికులు ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, శాశ్వత పరిష్కారం కోసం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News