కొత్తగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, గ్రంథాలయ కార్యదర్శి కే. కరణకుమారి ఆధ్వర్యంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొల్లు ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కల్పనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నారని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఉన్నత స్థానాల్లో నిలబడితేనే సమాజాభివృద్ధి, కుటుంబాభివృద్ధి సాధ్యమవుతుందని వివరించారు.
ఈ సందర్భంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కటింగ్ నిర్వహించి మహిళా ఉద్యోగులను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి కే. కరణకుమారి, ఆఫీస్ ఇన్చార్జి ఎం. నవీన్ కుమార్, గ్రంథపాలకురాలు జీ. మణిమృదుల, గ్రంథపాలకులు వాణి, రుక్మిణి, గీత, విద్యార్థినీ విద్యార్థులు మరియు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.








