పలాస;
శ్రీకాకుళం జిల్లా పలాస–కాశిబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని కాశిబుగ్గలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వెంకీకి చెందిన డొక్కరి మౌనిక అనే యువతిపై అదే వీధికి చెందిన గంధం కామేష్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు.
బుధవారం అర్ధరాత్రి వీధిలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన మౌనికను వెంటనే శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది.
సమాచారం అందుకున్న కాశిబుగ్గ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడు గంధం కామేష్‌ను అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని కాశిబుగ్గ సీఐ రామకృష్ణ తెలిపారు.
Post Views: 57








