వై7 న్యూస్ పలాస;
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన పలాస మార్కెట్ యార్డ్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.
కాశీబుగ్గ సీఐ వై. రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం…
ఆదివారం సాయంత్రం పలాస మార్కెట్ యార్డ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని తనిఖీ చేశారు. అతని వద్ద తనిఖీ చేయగా 11 కేజీల గంజాయి బయటపడింది. వెంటనే గంజాయితో పాటు ఒక సెల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తి గంజాయిని ఒడిశా రాష్ట్రంలోని బరంపురం నుంచి రేణిగుంటకు అక్రమంగా తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు సీఐ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు, అతడిని కోర్టులో హాజరు పరచి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ వై. రామకృష్ణ స్పష్టం చేశారు.
Post Views: 47









