E-PAPER

పవన్ కళ్యాణ్‌ను అభిమానిస్తే మిలిటెంట్లుగా మారాలా? అర్పిసి అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆక్షేపణ

రాజమండ్రి: వై 7 న్యూస్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ప్రధాని భద్రతా బలగాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు చట్ట పరంగా, సామాజిక బాధ్యత పరంగా తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తున్నాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (అర్పిసి) వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ విమర్శించారు.

అర్పిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన వారాంతపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ,“పవన్ కళ్యాణ్‌ను అభిమానించడం మిలిటెంట్‌ల్లా ప్రవర్తించాలని అర్థమా? ఒక నాయకుడిగా యువతను సత్సమాజ దారిలో నడిపించాలి. కాని పవన్ ఉపన్యాసాలు మాత్రం అభిమానులను రెచ్చగొట్టేలా ఉన్నాయి” అని వ్యాఖ్యానించారు.

పవన్ ఉపన్యాసాలు భద్రతా దళాలను అవమానించేలా ఉన్నాయా?

పల్లె వెలుగు 2.0 సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏకంగా ప్రధాని ప్రత్యేక భద్రతా దళాలు (SPG) తమ అభిమానులను చూసి భయపడుతున్నారనడం అత్యంత బాధాకరమని మేడా శ్రీనివాస్ అన్నారు.

“కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేవారు అనుభవజ్ఞులైన SPG బలగాలు… ఆంధ్రప్రదేశ్‌లో పవన్ అభిమానులను చూసి భయపడతాయా? ఇది ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం. పవన్ కళ్యాణ్ స్వయంగా SPG పేరును వాడుకోవడం PMO సీరియస్‌గా తీసుకోవాలి,” అని ఆయన పేర్కొన్నారు.

‘ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే చెబుతాయి’ పవన్ వ్యాఖ్యలపై ప్రశ్నలు

30 వేలకుపైగా అత్యాచారాల బారిన పడ్డ అమ్మాయిల సమాచారం కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పారు…పింక్ డైమండ్ విషయం ఒక ఉన్నతాధికారి చెప్పారు…తన ఇంటి వద్ద 200 కోట్ల సుపారి ఇచ్చి రెక్కి చేశారని ఇంటెలిజెన్స్ చెబుతుందన్న ప్రచారం…

“ఇంత సమాచారం కేంద్ర నిఘా వర్గాలు చెబుతే… పవన్ సభలో అనుమానాస్పద వ్యక్తి తిరుగుతున్నాడని ముందే చెప్పలేదా? సుపారి గ్యాంగ్ ఎవరో ఎందుకు చెప్పలేదు?” అని మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు.

పవన్ వాగ్దానాలు . చేతల్లో ఎందుకు కనిపించవు?

“పవన్ మళ్లీ మళ్లీ ‘నార్ తీస్తా, ఇరగదీస్తా, కొడకల్లారా’ వంటి పదాలు ఉపయోగించడం ఒక నాయకునికి తగదు. యువతను పెద్దల మాట వినేలా, క్రమశిక్షణతో ఉండేలా ప్రోత్సహించాలి. కాని బైక్ సైలెన్సర్లు తీసేయమని చెప్పేవారు నాయకులా?” అని ఆయన విమర్శించారు.

ఉచిత పథకాలపై పవన్ ద్వంద్వ వైఖరి

“నాడు ఉచిత పథకాల కోసం ప్రచారం చేసిన పవన్… నేడు వాటినే వినాశనమంటున్నారు. అదే సమయంలో చంద్రబాబు కూటమిలో అధికారంలో ఉన్నారు. పవన్ వ్యాఖ్యల వెనుక ఏదో అంతర్గత రాజకీయ లెక్కలున్నాయి” అని మేడా శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి ఇది మంచిది కాదు

“పవన్ కళ్యాణ్ వింత రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరుగుతోంది. ప్రత్యామ్నాయ రాజకీయ మార్పుకు ఆంధ్రులు సిద్ధం కావాలి,” అంటూ అర్పిసి అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో సెక్సలర్ విభాగం సభ్యులు ఎం.డి. హుస్సేన్, దుడ్డే సురేష్, కారుమూరి యుగంధర్, దోషి నిషాంత్, వాడపల్లి జ్యోతిష్, గుడ్ల సాయి దుర్గాప్రసాద్, సుంకర వెంకట భాస్కరరంగారావు, చల్లా సాంబశివరావు, చల్లా వంశీ తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News