పాల్వంచలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శబరిమలైకి ఇరుముడి కట్టుకొని వెళ్లుతున్న దీక్షపరులకు ఆయన వీడ్కోలు తెలియజేశారు. అయ్యప్ప దీక్ష అత్యంత పవిత్రమైనదని, భగవత్ నామస్మరణతో భగవంతుని సాక్షాత్కారం లభిస్తుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కాల్వ భాస్కరరావు, కనగల రాంబాబు, మిరియాల కమలాకర్, మల్లెల నాగేందర్, వనమా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 74









