E-PAPER

జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో ZPHS కమలాపురం విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫామ్ పంపిణీ

మంగపేట

మంగపేట మండలంలోని ZPHS కమలాపురం పాఠశాల విద్యార్థులకు జ్వాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ యూనిఫామ్‌ను పంపిణీ చేశారు. కీడజెన్ పాఠశాల, కొండాపూర్ వారు ఈ యూనిఫామ్‌లను అందించగా, కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, నిర్వాహకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జ్వాలా ట్రస్ట్ గౌరవ సలహాదారులు కలకొట్ల నరేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని, SSCలో పాఠశాల టాపర్‌కు ₹10,116 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు. విద్య అంటే క్రమశిక్షణ, కృషి, లక్ష్యం కలిసినపుడే విజయం సాధ్యమని విద్యార్థులను ప్రోత్సహించారు.

జ్వాలా ట్రస్ట్ అధ్యక్షుడు కోడెల నరేష్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం ట్రస్ట్ ఎల్లప్పుడు ముందుండుతుందని తెలిపారు. పెద్దయ్యాక సేవాభావం, సమాజానికి తిరిగి ఇవ్వడం వంటి విలువలు ప్రతి విద్యార్థిలో పెరగాలని పిలుపునిచ్చారు.

అదేవిధంగా జ్వాలా ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మునిగాలా రాకేష్ మాట్లాడుతూ చదువు తో పాటు క్రీడలలో కూడా రాణించాలని, ఆ దిశగా ప్రోత్సాహం కోసం స్పోర్ట్స్ యూనిఫామ్‌లను అందిస్తున్నామని చెప్పారు. క్రీడలు విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పెంచుతాయని వివరించారు.

పాఠశాల హెచ్ఎమ్ గడ్డి శ్రీనివాస్ జ్వాలా ట్రస్ట్‌కు మరియు కిడ్ జెన్ పాఠశాల కొండాపూర్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల కోసం సామాజిక సంస్థలు ముందుకు రావడం ఆదర్శనీయం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో హెచ్ఎమ్ గడ్డి శ్రీనివాస్, జ్వాలా ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్, ప్రధాన కార్యదర్శి మునిగాలా రాకేష్, సలహాదారు కలకొట్ల నరేష్ రెడ్డి, మీడియా ఇంచార్జి సమ్మరావ్, ఉపాధ్యాయులు ప్రసాద్, నాగలక్ష్మి, నాగమ్మ, నరేష్, రమేష్, రాజేశ్వర్ రావు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!