మణుగూరు, ఆగస్టు 2 (వై7 న్యూస్):
కాంగ్రెస్ పార్టీ రేణుకా చౌదరి క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి నాయకులు గురజాల గోపి అధ్యక్షతన, రేణుక అక్షర మహిళా మండలి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, పేదల గుండెచప్పుడు, దివంగత నేత డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నేతలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మాట్లాడుతూ ఆయన ముఖ్యమంత్రిగా చేసిన సేవలు ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోతాయని, చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు.
కార్యక్రమంలో రేణుక అక్షర మహిళా మండలి అధ్యక్షురాలు పూనెం సరోజ, సీనియర్ మహిళా నాయకులు ఎండీ షబానా, కోరి శ్యామల, ఉపాధ్యక్షురాలు బొడ్డు సౌజన్య, రెడ్డీబోయిన రేణుక, కన్నారపు వసంత, దేరంగుల సుజాత, దోకినేని సౌజన్య, నాంపల్లి రమ, కన్నారపు శైలజ, బడిశా పార్వతి, సీనియర్ నాయకులు ఎండీ నూరిదిన్, పింగళి మాధవ రెడ్డి, చారి తదితరులు పాల్గొన్నారు.









