-
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం మూల మల్లారం వద్ద ఈ రోజు సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.
TS 02 UP 6789 నంబర్ గల లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న రేకుల షెడ్డును ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు.
స్థానికులు వెంటనే గమనించి 108 అంబులెన్స్ సహాయంతో గాయపడ్డ డ్రైవర్‌ను మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Post Views: 275









