పలాస,ఆగస్టు20 వై 7 న్యూస్
వంశధార కాలువ ద్వారా సాగునీరు బుధవారం విడుదలైంది. ఎమ్మెల్యే శిరీష వజ్రపుకొత్తూరు మండలం బొడ్డపాడు గ్రామంలో కాలువ వద్ద జలహారతి ఇచ్చి సాగునీటిని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “రైతులకు సకాలంలో సాగునీరు అందించడం నా ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. కాలువల ద్వారా వచ్చే నీటితో పంటలు సమృద్ధిగా పండాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
అధికారులు, కూటమి నాయకులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేసారు. రైతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, సాగునీరు విడుదల చేసినందుకు ఎమ్మెల్యే శిరీషకు ధన్యవాదాలు తెలిపారు.
Post Views: 57









