E-PAPER

మధురవాడ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం పలాస వాసులు ఇద్దరు మృతి

వై 7 న్యూస్, పలాస

విజయనగరం జిల్లా మధురవాడ జాతీయ రహదారిపై సోమవారం సాయంత్రం జరిగిన భయానక రోడ్డు ప్రమాదంలో పలాస వాసులు ఇద్దరు దుర్మరణం పాలయ్యారు.ప్రమాదంలో మృతి చెందినవారు సతీష్ (19), ఉష (18). జోడుగుళ్ళపలేనికి చెందిన సతీష్ టైల్స్ కూలీగా పనిచేస్తున్నాడు. పలాసకు చెందిన ఉష నగరంలో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తోంది.సోమవారం సాయంత్రం సతీష్ తన ద్విచక్ర వాహనంపై ఉషను రైల్వే స్టేషన్‌కి తీసుకెళ్తుండగా మధురవాడ వద్ద లారీ–బస్సు మధ్యలో అదుపు తప్పి లారీ కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News