రిపోర్ట్: పులిపాటి పాపారావు
హైదరాబాద్ జులై 29 వై 7 న్యూస్;
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లను రద్దు చేయాలని కోరుతూ ఆదివాసి సేన తరఫున హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ నెం.22007/2025పై గౌరవ న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నాగేష్ ఈ రోజు విచారణ చేపట్టారు.
ఈ పిటిషన్ తరఫున న్యాయవాదులు సి. హెచ్. రవికుమార్ మరియు సోడే వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వారు వాదిస్తూ, ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులకు ఇండ్ల కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలు మరియు మెమోలు, అలాగే LTR (ల్యాండ్ ట్రాన్స్‌ఫర్ రెగ్యులేషన్) మరియు పీసా (పాంచాయత్ ఎక్స్‌టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్) చట్ట నిబంధనలకు వ్యతిరేకమని న్యాయస్థానానికి వివరించారు.
ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజనేతరులకు ప్రత్యేకంగా మినహాయింపు లభించదనీ, ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు పూర్తిగా చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గిరిజనేతరులకు కేటాయించిన ఇండ్లను తక్షణమే రద్దు చేయాలని కోరారు.
వాదనలు విన్న గౌరవ ధర్మాసనం, ప్రభుత్వం తమవద్ద ఉన్న సమాచారంతో హాజరుకావాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను 2025 ఆగస్టు 5 తేదీకి వాయిదా వేసింది.
ఈ విషయాన్ని ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వజ్జ జ్యోతి బసు తెలిపారు.