E-PAPER

మృతునికి శ్రద్ధాంజలి ఘటించిన బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య

కరకగూడెం (జూలై 29), వై న్యూస్ తెలుగు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం గ్రామానికి చెందిన రాజమళ్ల యాకుబ్ (వయస్సు 78) అనారోగ్య కారణంగా నేడు పరమపదించారు. ఆయన మృతిపై బీఆర్‌ఎస్ పార్టీ కరకగూడెం మండల అధ్యక్షుడు రావుల సోమయ్య తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

రావుల సోమయ్య యాకుబ్ కుటుంబ నివాసానికి స్వయంగా వెళ్లి, మృతుని పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,
యాకుబ్ గారు మంచి వ్యక్తిగా గ్రామంలో పేరుపొందిన వారు. వారి మృతి గ్రామానికి తీరని లోటు అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఊకే రామనాథం, బుడగం రాము, సాధనపెల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మృతుని అంత్యక్రియలలో పలువురు గ్రామస్తులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరయ్యారు.

రిపోర్టర్: కే.దిలీప్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్