గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్
మెదక్ జులై 29 (వై 7 న్యూస్ ప్రతినిధి)
పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో రిజర్వేషన్ కల్పించాలని, బుల్లెట్ కంటే శక్తివంతమైనది బ్యాలెట్ కాబట్టి గిరిజనులంతా ఏకతాటి పైకి వచ్చి ఐక్యమత్యం చాటాలని గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు జైపాల్ నాయక్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రంలో ఉండే మొత్తం గిరిజనుల జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు, బడ్జెట్టు, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. 2014 కు పూర్వం సమైక్యాంధ్ర ప్రదేశ్ లో గిరిజనులకు (6) ఆరు శాతం లభించే రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి పెరిగిన జనాభా ప్రకారం గిరిజనులకు 10 పది శాతం రిజర్వేషన్లు పెరిగాయి. కానీ, తెలంగాణ రాష్ట్ర గిరిజన జనాభాలో కేవలం మూడు జిల్లాల్లో (2) రెండు నుండి (3) మూడు శాతం జనాభా కలిగిన ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులకే అసెంబ్లీలో (12) పన్నేండు, జిల్లాల్లో ఉండే ఏజెన్సీ ప్రాంతాల్లోనే పార్లమెంటులో (2) స్థానాలు కేటాయించి, రాష్ట్ర గిరిజన జనాభాలో (7) ఏడు నుండి (8) ఎనిమిది శాతం గిరిజనులు ఉండే 7 ఏడు మైదాన ప్రాంత జిల్లాల గిరిజనులకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో ఒక్క స్థానాన్ని కూడా కేటాయించలేరు దీనిప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని (10) పది జిల్లాల్లోని కేవలం మూడు ఏజెన్సీ జిల్లాల గిరిజనులకే అసెంబ్లీ& పార్లమెంట్ చట్టసభల్లో అవకాశం కల్పించి మైదాన ప్రాంతం లోని (7) జిల్లాల మైదాన ప్రాంత గిరిజనులకు చట్టసభలకు రాకుండా నిరోధించారు అని అన్నారు. రాజ్యాంగం స్పిరిట్ ప్రకారం ఏజెన్సీ ఏరియాలో మైదాన ప్రాంత గిరిజనేతరులు చట్ట సభల్లో కానీ లోకల్ బాడీ ఎన్నికల్లో గాని పోటీ చేసే అవకాశముండదు, కనుక ఆయా చట్ట సభల స్థానాలు ఆటోమేటిక్ గా గిరిజనులకే దక్కుతాయి కానీ మొత్తం పది (10) శాతం గిరిజన జనాభాలో ఏడు (7) శాతం గిరిజన జనాభా కలిగిన మైదాన ప్రాంత జిల్లాల గిరిజనులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏజెన్సీ ప్రాంత గిరిజనులకు లభించే రిజర్వేషన్లకు అదనంగా వారి జనాభా ప్రకారం మిగతా మైదాన ప్రాంత జిల్లాల గిరిజనులకు వారికి లభించవలసిన 7 ఏడు శాతం రిజర్వేషన్లు కల్పించి అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాల యందు మైదాన ప్రాంతాల్లో నివసించే గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వకుండ ఘోరమైన అన్యాయాన్ని తలపెట్టి మైదాన ప్రాంతాలలోని గిరిజనుల హక్కులను కాలరాసారు.రాష్ట్ర గిరిజన జనాభాలో 70% మైదాన ప్రాంత గిరిజనులు ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలు మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ మరియు హైదరాబాద్ లో అసెంబ్లీ మరియు పార్లమెంటు యందు మైదాన ప్రాంత గిరిజనులకు సీట్లు కేటాయించాలన్నారు మెదక్ జిల్లాలోని గిరిజన తండాల వారు గత కొన్ని సంవత్సరాల నుండి ఫారెస్ట్ భూములను సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి గిరిజనులకు వెంటనే పోడు భూముల పట్టాలను ఇవ్వాలని,పెండింగ్ లో వున్నా గిరిజనుల డిఐసి సబ్సిడీలను వెంటనే మంజూరు చేయాలని 57 సంవత్సరాలు దాటిన గిరిజన వృద్ధులకు పింఛన్ మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం మెదక్ నియోజకవర్గం అధ్యక్షులు శ్రీను నాయక్, ఉపాధ్యక్షులు సానిక్ష ఫౌండేషన్ నిర్వాహకులు శివనాయక్, జాదవ్ రమేష్,కిషోర్, విజయ్, రాజు లు పాల్గొన్నారు