E-PAPER

తెల్లం వెంకటరావు పిటిషన్‌కు మద్దతుగా ఆదివాసి సమాజం

ఎస్టీ హక్కులను కాపాడే పోరాటమిది

ఆధార్ సొసైటీ రాష్ట్ర కమిటీ సభ్యులు పోడియం బాలరాజు.

కొత్తగూడెం,జూలై 29 వై 7 న్యూస్:

భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు ఆదివాసి సమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఈ పిటిషన్ ద్వారా, లంబాడా సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితా నుండి తొలగించాలనే డిమాండ్‌ను ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆదిలాబాద్ నుంచి సోయం బాబురావు, భద్రాచలం నుంచి తెల్లం వెంకటరావు వంటి కీలక గిరిజన నాయకులు కూడా అదే అభిప్రాయంతో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. పలు రాష్ట్రాల ఆదివాసీ సంఘాలు ఈ పోరాటానికి అండగా నిలుస్తున్నాయి.

లంబాడా ఒత్తిడి హెచ్చరికలు

సోమవారం హైదరాబాద్‌లో లంబాడ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది నేతలు తెల్లం వెంకటరావుతో సమావేశమై, ఆయనను బెదిరించేందుకు ప్రయత్నించినట్లు ఆధార్ సొసైటీ ఆరోపించింది. “మీరు కలిసిమెలిసి ఉన్న గిరిజన వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారు… పిటిషన్ వెనక్కి తీసుకోండి” అంటూ ఒత్తిడికి దిగారన్న ఆరోపణలు వచ్చాయి!?.

ఈ పరిణామాలను తీవ్రంగా ఖండించిన ఆధార్ సొసైటీ, ఇది న్యాయ పోరాటాన్ని దెబ్బతీసే కుట్ర అని పేర్కొంది. ఒక ప్రజా ప్రతినిధి న్యాయవిధానం ద్వారా దాని పరిధిలో అడుగులు వేస్తుంటే, అతనిపై బెదిరింపులకు దిగడం అప్రజాస్వామికమని మండిపడింది.

“లబ్ది లంబాడాల చేతిలోకి” గిరిజనులకు అసలైన నష్టం!?.

ఆధార్ సొసైటీ వాదన ప్రకారం, లంబాడాలు నిజమైన ఆదివాసులు కాదని, వారి చరిత్ర వలస జీవులుగా ఉన్నదని అభిప్రాయపడుతున్నారు. అయినా వీరికి ఎస్టీ హోదా రావడంతో, వాస్తవ ఆదివాసుల విద్య, ఉద్యోగ, సంక్షేమ లబ్ధి లన్నీ లంబాడాల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
“ఇంజినీరింగ్, మెడికల్, గురుకుల విద్యా అవకాశాల్లో కోయ, గొండ్, కుమ్రం భీమ్ పిల్లలకు అవకాశమే రావడమే లేదు. కానీ లంబాడాలు, వాణిజ్యరంగాల్లో ముందున్న వారు కోటాలో ప్రవేశించి ప్రతి అవకాశాన్ని తమ కోసం ఉపయోగించుకుంటున్నారు,” అని వారు తెలిపారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో లంబాడాల ఆధిపత్యం పెరిగిపోయిందని, నిజమైన ఆదివాసుల పరిస్థితి మాత్రం పదవ తరగతిలోనే ఆగిపోయే స్థాయికి దిగజారిపోయిందని గణాంకాలతో చూపించారు.

గిరిజన ప్రాంతాల్లో ఉద్రిక్తతలు సమాజాన్ని చీల్చేస్తున్న అసమానత.

తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలు , భద్రాచలం, ములుగు, ఏటూరు నాగారం, బోథ్, ఇల్లెందు లాంటి ప్రాంతాల్లో లంబాడా, కోయ వర్గాల మధ్య అసంతృప్తి పెరిగిపోతున్నదని, ఇది మౌనంగా ఉన్న అబద్ధపు సమానతకు చెంపపెట్టు అని ఆధార్ సొసైటీ పేర్కొంది.

“మేము పేదవాళ్లం. అడవుల్లో జీవనం సాగిస్తున్నవాళ్లం. ఓ చిన్న స్కాలర్‌షిప్ కోసం మేం ఏడాది చుట్టు తిరుగుతుంటే, పట్టణాల్లో బ్రాండెడ్ దుస్తులు ధరించిన లంబాడా పిల్లలు అదే కోటాలో మేము వెనుకబడి పోతున్నామంటే ఇది న్యాయమా?” అని ఒక సభ్యుడు ఆవేదన వ్యక్తం చేశారు.

సీతక్క మౌనం వెనుక అంతర్యం ?

శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివాసి వర్గానికి చెందినవారు. అయినా ఈ గిరిజన అస్తిత్వ పోరాటంపై ఆమె ఇప్పటి వరకు నోరు మెదపకపోవడాన్ని ఆధార్ సొసైటీ సభ్యులు తీవ్రంగా విమర్శించారు.

“మీరు మా వర్గానికి చెందినవారు. అయినా ఈ విషయంలో మౌనంగా ఉండటం విచిత్రం. ఆదివాసీల తరఫున గళం వినిపించకపోతే, మీరు ఆదివాసీలకు j ఇచ్చే విలువ ఇదేనా?” అని వారు ప్రశ్నించారు.

భద్రాచలం‌లో అడుగుపెట్టొద్దు
మహబూబాబాద్ ఎంపీకి గట్టి హెచ్చరిక ?

తెల్లం వెంకటరావుపై రాజకీయ ఒత్తిడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, మహబూబాబాద్ ఎంపీ భద్రాచలంలో అడుగుపెట్టడం కష్టమవుతుందని ఆధార్ సభ్యులు హెచ్చరించారు.ఇది రాజకీయ పోరాటం కాదు. ఇది గిరిజనుల హక్కుల యుద్ధం. ఎవరు అడ్డుపడినా సహించం” అని వారు స్పష్టం చేశారు.

ఈ పోరాటం కేవలం కోర్టులో నడుస్తున్న పిటిషన్ కాదు. ఇది గిరిజనుల ఉనికి, వారి భవిష్యత్తు గురించి చర్చ. తెల్లం వెంకటరావు వేసిన పిటిషన్ వెనుక ఏకైక లక్ష్యం వాస్తవ ఆదివాసులకు న్యాయం జరగాలి. దశాబ్దాలుగా నిస్సహాయంగా తలవంచిన గిరిజన సమాజం ఇప్పుడు గళమెత్తుతోంది.

ఆదివాసి హక్కులే ముఖ్యం”: పోడియం బాలరాజు ప్రకటన

బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే పోడియం బాలరాజు ఈ అంశంపై కీలక ప్రకటన చేశారు.
“మేము ఏ పార్టీలో ఉన్నా పరవాలేదు. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు . కానీ మేము మా ఆదివాసి సమాజం కోసం పోరాటం చేస్తాం. ఆదివాసి మంత్రులను, ఎమ్మెల్యేలను ఒప్పించి ఈ పోరాటంలో కలుపుతాం” అని స్పష్టం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్