కరకగూడెం జూలై 3 వై 7 న్యూస్ తెలుగు
కరకగూడెం మండలంలో ఆదివాసీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ, భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్‌కు ఆదివాసీ సమాజం సంపూర్ణ మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.
అధికారి స్థాయిలో చేసిన ఈ చట్టబద్ధ చర్యకు జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఎస్టీ హక్కుల పరిరక్షణకు సంబంధించిన న్యాయపరమైన మార్గం తీసుకోవడాన్ని వారు అభినందించారు. ఆదివాసుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వానికి బాధ్యత ఉందని, ఈ అంశంపై రాజ్యాంగ, న్యాయపరమైన పరిశీలన అవసరమని సూచించారు.
సమావేశంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి కలం సాంబమూర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్ చందా రామకృష్ణ, తుడుందెబ్బ జిల్లా నాయకులు సుతారి నాగేశ్వరరావు, కలం సంపత్, కలం వేణుగోపాల్, మలకం నరేష్, ఊకె నరేష్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న నేతలు ఎస్టీ గుర్తింపు, హక్కుల పరిరక్షణపై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.