2024-2025 విద్యా సంవత్సరంలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినిలకు చిరు సత్కారo
మెదక్ ఆగస్టు 1 వై సెవెన్ న్యూస్
ఈరోజు మా కళాశాలలో పేరెంట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది . ఇందులో భాగంగా టీజీ ఎంఆర్, ఈ ఎల్ ఎస్,సెక్రెటరీ షఫీ ఉల్లా ఖాన్ సార్ అంతర్జాలం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని మైనార్టీ విద్యాసంస్థల తో ఇందులో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఆ పాఠశాలల పనితీరుపై, పాఠశాలలో ఉన్న సమస్యలపై తల్లిదండ్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. దీనితో పాటుగా తల్లిదండ్రులకు పిల్లలను రెసిడెన్షియల్ లో 100% హాజరు ఉండేలా చూడాలని,విద్యార్థుల యొక్క విద్యా ప్రమాణాలు పెంచే దిశగా ఉపాధ్యాయులు,లెక్చరర్స్,తోపాటుగా తల్లిదండ్రులను కూడా ముఖ్య పాత్ర అని తెలిపారు. విద్యార్థులు 100% పాఠశాలలోనే ఉన్నప్పుడు వాళ్ల యొక్క ప్రగతి అనేది మెరుగుపడుతుందని,క్రమశిక్షణ అలవాటు అవుతుందని, రాబోయే సమాజంలో గొప్ప పౌరులుగా ఉంటారని వివరించారు.
ఈ కార్యక్రమం లో భాగంగా టీవీ ఎంఆర్ జెసి గ్రేడ్,1 లో 2004 -2005 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ మంచి ఫలితాలు సాధించిన 15 మంది విద్యార్థినీలను వారి యొక్క తల్లిదండ్రుల సమక్షంలో ప్రిన్సిపల్ ఆర్. సురేఖ విద్యార్థులకు చిరు సత్కారాన్ని అందించారు.ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థినిలు సాధించిన ఫలితాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించడానికి అందుకు తల్లిదండ్రులు కూడా సహకరించాలని, పిల్లల యొక్కహాజరు100% ఉండేలా చూడాలని తల్లిదండ్రులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల బృందం మరియు తల్లిదండ్రులు విద్యార్థినిలు పాల్గొన్నారు.