మణుగూరు, జూలై 20: వై 7 న్యూస్;
మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని బాపనకుంట ప్రాంతానికి చెందిన పచ్చిపాల దాసు (వయసు 70) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. కుటుంబ పరిస్థితులు దుర్భరంగా ఉండటంతో దహన సంస్కారాలు నిర్వహించడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న “మేము సైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్” వెంటనే స్పందించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో దహన సంస్కారాల నిమిత్తంగా రూ. 3,000/- ఆర్థిక సహాయం దాసు కుటుంబానికి అందజేయబడింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ కోశాధికారి రంగా శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు మంగి మల్లికార్జున్, ట్రస్ట్ సభ్యులు పి. జగన్ మోహన్, తమ్మిశెట్టి వాసు, అముల్ శ్రీనివాస్, చిందుకూరి రామారావు, గ్రామ పెద్దలు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 25