మణుగూరు, జూలై 19 (వై 7 న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గానికి చెందిన మణుగూరు మండలంలోని మిట్టగూడెం గ్రామానికి చెందిన ఎం. నరేష్ ప్రస్తుతం సింగరేణి కంపెనీలో ఎస్ & పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ఆయన తండ్రి ఎం. వెంకటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషాద సమయంలో నరేష్ కుటుంబానికి మానవతా దృక్పథంతో మద్దతుగా నిలిచిన ఆయన తోటి సెక్యూరిటీ సిబ్బంది ఆదర్శప్రాయంగా వ్యవహరించారు.
జూలై 19, 2025న నరేష్ కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకు ఎస్ & పి సి ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు కలిసి రూ. 14,000/- విరాళంగా అందించారు. వారి నివాసానికి వెళ్లి పరామర్శించి, ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్ & పి సి ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు, తోటి సెక్యూరిటీ గార్డులు సంఘీభావంగా పాల్గొన్నారు. నరేష్ కుటుంబానికి భరోసానిచ్చే విధంగా, మేమున్నాం అన్న భావనను ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.