E-PAPER

శ్రీ విద్యాభ్యాస పాఠశాలలో జ్ఞానేశ్వర్ రాజ్ జన్మదిన వేడుకలు

యాభై కిలోల బియ్యం విద్యార్థి విద్యార్థులకు సహపంక్తి భోజనాలు

మణుగూరు, జులై 09 వై 7 న్యూస్;
సత్తుపల్లి కి చెందిన ఎం మమత,శివకుమార్ దంపతుల కుమారుడు జ్ఞానేశ్వర్ రాజ్ జన్మదిన వేడుకలు. మణుగూరు మండలం సంతోష్ నగర్ లోని శ్రీ విద్యాభ్యాస పూర్వ బాలు వెలుగు పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలకు యాభై కిలోల బియ్యాన్ని విద్యార్థినీ విద్యార్థులకు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ కార్యాలయ డిప్యూటీ స్టాటిస్టికల్ ఆఫీసర్ వై విజయలక్ష్మి పండిట్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. నిరుపేద విద్యార్థిని విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడుతున్న శ్రీ విద్యాభ్యాస పాఠశాల నిర్వాహకులను మరియు సిబ్బందిని ఆమె అభినందించారు. మణుగూరు ప్రాంతంలో శ్రీ విద్యాభ్యాస పాఠశాల మరియు వృద్ధాశ్రమాలకు సమీప గ్రామాల నిరుపేద ప్రజలకు ఎంతగానో సహాయపడుతూ ఇచ్చుకునే వారికి పుచ్చుకునే వారికి మధ్య వారధిగా సహాయ సహకారాలు అందిస్తున్న మణుగూరు ఏరియా సింగరేణి సేవా సమితి సామాజిక సేవా స్ఫూర్తిని ఆమె కొనియాడారు. తమ కుమారుని జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన సత్తుపల్లి కి చెందిన మమత శివకుమార్ దంపతులను సమన్వయం చేస్తున్న సత్తుపల్లి చెందిన సింగరేణి ఉద్యోగిని రజినీ ని ఆమె ఎంతగానో ప్రశంసించారు. దాతల సహకారంతో విద్యార్థి విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆమే ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, సామాజిక సేవకురాలు నాగుల జ్యోతి, పాఠశాల నిర్వహకులు బి జగన్మోహన్ రెడ్డి, కిరణ్, సిబ్బంది రాధా తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :