E-PAPER

కుంగ్ – ఫు కరాటే పోటీలలో రానిస్తున్న గ్రామీణ విద్యార్థులు

గ్రామీణ స్థాయి నుండి నేషనల్ స్థాయి వరకు ఉత్తమ ప్రతిభ.

స్కూల్ లెవల్ టాటా రత్న కప్ లో న్యూ పవర్ కుంగ్ ఫు విద్యార్థుల హావా

షాద్ నగర్ డివిజన్ జూన్ 16 వై 7 న్యూస్

గ్రామీణ స్థాయి నుండి ఏకంగా నేషనల్ స్థాయిలో పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ చాటుతున్నారు షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు కసుకుర్తి రాహుల్,కసుకుర్తి చైతన్య,గౌండ్ల నిత్విక్ గౌడ్ లు..వివరాల్లోకి వెళితే షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ కోచ, మాస్టర్స్ బాల్ రాజ్ శిష్యరికంలో రాటుడదేలిన అహ్మద్ ఖాన్ ( బ్రూస్లీ )ఆధ్వర్యంలో శిక్షణ పొందుతూ ప్రతి ఈవెంట్ లో పాల్గొంటు డివిజన్ స్థాయి,జిల్లా స్థాయి నుండి ఏకంగా నేషనల్ స్థాయిలో నిర్వహించే పోటీలలో పాల్గొని అనేక పథకాలు పొందటమే కాకుండా షిల్డ్ లు సన్మానాలు పొందటం జరిగింది.ఇటీవలే నేషనల్ ఛాంపియన్ లో కూడా పాల్గొని బంగారు పథకాలు కూడా పొందారు.ఇందులో ముఖ్యంగా అన్నదమ్ములు రాహుల్,చైతన్య లు,వీరితో పాటు గౌండ్ల నిత్విక్ గౌడ్ లు ఇటీవల నిర్వహించిన తెలంగాణ ఛాంపియన్ స్కూల్ లెవల్ టాటా రత్న కప్ లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరచడం తో పాటు నిర్వాహకులు,స్కూల్స్,టీచర్స్,పేరెంట్స్ తోటి పోటి దారుల హృదయాల్లో చోటు సంపాదించారు.ఉత్తమంగా తీర్చిదిద్దిన మాస్టర్ అహ్మద్ ఖాన్ ను ట్రైనర్ బాల్ రాజ్,పేరెంట్స్,ఉపాధ్యాయులు,విద్యార్థినికి అభినందనలు తెలియజేశారు,విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ మాట్లాడుతూ,కుంఫు కరాటే విద్య నేర్చుకోవడం వల్ల విద్యార్థులు,మానసికంగా,శారీరకంగా,ఆత్మస్థైర్యం కోల్పోకుండా మనోధైర్యంగా ఉంటారనితెలిపారు.అదేవిధంగా,విద్యార్థినికి శిక్షణ ఇచ్చినటువంటి న్యూ పవర్ కుంగ్-ఫు అహ్మద్ ఖాన్ లను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు…

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News  

error: Content is protected !!