కొత్తగూడెం
కొత్తగూడెం పట్టణ పరిధి విజయ విఘ్నేశ్వర దేవాలయంలో ప్రతి బుధవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు పాల్గొన్నారు. ఆలయంలో అన్నదానం నిర్వహించే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిర్విరామంగా కొనసాగిస్తున్న సభ్యులు సమాజంలో మరిన్ని సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజయ విఘ్నేశ్వర భక్త బృందం మరియు కొదుమూరి. శ్రీనివాసరావు, అయిత.ప్రకాశ్,శ్రీను,అనూప్ ఖండేల్ వాల్, నుకల ప్రవీణ్, ఉజయప్రకాష్, బొబ్బాల. వెంకట్ యాదవ్, బొల్లం.ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 97









